లలితా సహస్రనామ పారాయణం

సహస్రనామాలలో లలితా సహస్రం’ అతి శక్తిమంతమైనది మంత్ర విశిష్టత ఏమిటంటే:

  1. వేయినామాలలో  నామము కూడా మరల రాదుఒకటి రెండు అలా వచ్చినట్లు అనిపించుతాయి కానీఅది పద విభజనలో తేలిపోతుంది.
  2. మొత్తం శ్లోకాల సంఖ్య: 182 న్నరఅంటే 365లో (సంవత్సరములోసగం. ఏదో విశేషముంది.
  3. చిన్న నామాలున్నాయిపెద్దవి కూడా ఉన్నాయిఅతి పెద్దనామాలు శ్లోకంలో ఒక పాదమంత. అతి చిన్న నామం ఒక అక్షరమే: ‘ఈ’ అని 138 వ శ్లోకంలో.


“మననాత్ త్రాయతే మంత్రం” అన్నది తెలిసినదేమరల మరల స్మరించిన పఠించిన కొద్దీ తరింప (దాటవేస్తుందిచేస్తుంది మంత్రంపరమార్థంలో తరించటము మోక్షమయితేలౌకికంగా సంసారంలోని బాథల నుండి క్రమక్రమంగా బయట పడవేస్తుందిఅంతే కాదుఆనంద తీరాలకు చేరుస్తుంది.


ప్రతి సహస్రంలో వలె  మంత్ర రాజంలో 1000 నామాలున్నాయిస్తోత్రం చదివేటప్పుడు ప్రతి నామాన్ని విడివిడిగా పలకాలిమనం లౌకిక ప్రపంచములో ఒక వ్యక్తిని పేరుతో ఎలా పిలుస్తామోకృష్ణావేంకటేశాపద్మినీశారదా..., అలాగేఅమ్మవారి నామాలుసరైన పేరుతో పిలిచినపుడు  వ్యక్తి స్పందిస్తాడులేకపోతే పట్టించుకోడుఅమ్మవారి నుంచి స్పందన లభించాలంటే ఆమె నామాలు స్పష్టంగా - తనని పిలిచినట్లుఉద్దేశించినట్లు - పలకాలిస్పందన తప్పక ఉంటుందిఫలితం వస్తుంది  మెల్లమెల్లగా.


 మంత్ర రాజాన్ని అనేక గాయనిలు తమ దివ్యమైన గాత్రంతో గానం చేశారులక్షలాది మంది విని ఆనందిస్తున్నారుకూడాయూట్యూబులో లక్షలలో చూస్తున్నట్లు తెలుస్తోందిఅది వినివినీ అందరికీ అలాగునే పారాయణం చేయటం సహజంగా అనిపిస్తుందితేలికగా అనిపిస్తుందిఅయితే రాగయుక్తంగా ఉన్న  గానం ఒక శ్లోకాన్ని రెండు భాగాలుగానోనాలుగు భాగాలు గానో పారాయణం చేయటం జరుగుతోంది. ఆ విభజన భిన్న నామాలుగా కాక, నామాలను అయుక్తంగా ముక్కలు చేయడం జరుగుతోంది, దీని వల్లన అక్కడక్కడ అమ్మవారి నామాలు ‘అపనామాలుగా’ పలుకుతాం. ఇలా పారాయణం చేయటంలో శబ్దదోషము జరుగుతుంది. శ్రద్ధగా చదివే భక్తులకు ఇలాంటి చిన్న తప్పుల వల్లన దోషమేమీ లేకున్నా,  మరింత అమ్మవారి నుండి స్పందనాఅనుగ్రహం పొందటానికి నామాలు విడివిడిగా పలకాలి


ఇదే ఈ పోస్టు యొక్క ముఖ్య ఉద్దేశ్యము.


భక్తికి భావము చాలా ముఖ్యంభావలోపముంటే మంత్రం సారహీనమవుతుందియాంత్రికమవుతుందిదుష్ఫలితాలు లేకపోయినా సత్ఫలితాలను ఇవ్వదు. శబ్దానికి, ముఖ్యంగా సంస్కృత శబ్దాలకు మనస్సునూ, బుద్ధినీ వికసింపచేసే శక్తి ఉంది. అందువల్లన అమ్మవారి నామాలు రాగధోరణిలో అపనామాలుగా చదవకుండా శ్రద్ధ తీసుకుని ప్రతి నామమూ విడివిడిగా చదివితే అమ్మ అనుగ్రహం పెరుగుతుందని నా నమ్మకము, అనుభవం.


మంత్రం యొక్క ఫలితాన్ని పొందటానికి నామాలు భావిస్తూ పఠించాలిఒక్కొక్కనామము విడవిడిగా పఠిస్తూంటే  నామం యొక్క భావం అర్థమవుతుందిస్థూల, సూక్ష్మ శరీరాలలోకి దివ్యశక్తి క్రమంగా చేరుతుందిక్రమక్రమంగా ఆరోగ్యముప్రశాంతత అలవడతాయి. అయితే ఫలితము ఉంటుందాఎక్కువాతక్కువా అనేది మనం బరువు చూసినట్లోబిపీ చూసినట్లోఎత్తు కొలిచినట్లో కొలవలేముకానీ లలిత సహస్రం చదివిన తరవాత


  1. కనీసం కొంచెం ప్రశాంతత వెంటనే తెలుస్తుంది
  2. క్రమంగా మంచి నిద్ర పడుతుందినిద్రలో నామాలు అసంకల్పితంగా గుర్తుకు వస్తాయి
  3. జ్ఞాపక శక్తి, ఏకాగ్రతా పెరుగుతాయి.
  4. వారాలు గడిచాక ఫలితాలు మరింత గోచరిస్తాయిఅది వ్యక్తి యొక్క శ్రద్ధక్రమబద్ధమైన పారాయణం పై ఉంటుంది.


నామాలలో మనకు గోచరించే అర్థాలే కాక లోతైన అర్థాలు ఉన్నాయిడాజి.ఎల్.ఎన్శాస్త్రిగారు ‘శ్రీ లలితా సహస్ర నామవివిరణం’ అన్న పుస్తకంలో ప్రతి నామాన్ని సహేతుకంగాశాస్త్రీయంగా నిర్వచించి వివరించారు. (వీరు విశాఖపట్టణ వాస్తవ్యులు ‘ది వరల్డ్ టీచర్ ట్రస్టు’ లో ముఖ్య స్థానంలో ఉండిన శ్రీ ఎక్కిరాల కృష్ణమాచార్యులు గారి ప్రియశిష్యులు).

 పుస్తకము ఆధారంగానే నామనిర్ణయం జరిగిందివివరణ చదివితే అర్థం బోధపడిభావం మరింత లోతుగా మనస్సులోకిచేరుతుందిభక్తి ధృఢ పడుతుందిశరణాగతి సరళమవుతుందిజీవితము సుగమము అవుతుందినిశ్చింతతృప్తిపెరుగుతాయి పుస్తకము గూగుల్ లో డౌన్ లోడ్ చేసుకోండి. శ్రద్ధగలవారు చదువుకో గలరు.


క్రింద లంకెలో లలితా సహస్రనామము ధ్యానన్యాసపంచోపచారములతో కలిపిన సహస్రనామస్తోత్రం ఇచ్చాను. 


ప్రతి శ్లోకములో రెండుపాదాలు. మొదటి పాదము ‘।’, రెండవ పాదము ‘।।’ అన్న సంకేతాలతో ముగుస్తాయి. ఏ పాదములో నైనా ఒకటి కన్నా ఎక్కువ నామాలుంటే చిన్న విరామముతో, అంటే కామా (‘,’) తో ఇవ్వబడ్డాయి.


చదవాలన్నా, డౌన్ లోడ్ చెయ్యాలన్నా, ఈ లంకె నొక్కండి


Comments